ఎండిన ఆకులు, ఇతర చెత్త కలవ కుండ తీయాలి. తీసిన పత్తిన నీడలో ఆరబెట్టి నిల్వ చేయాలి. నిల్వ చేసిన పత్తికి గాలి తగిలేటట్లు తేమ తగలకుండా చూడాలి. పత్తి నాణ్యత ముఖ్యంగా పింజా పొడవు, పింజ గట్టి తనం, పింజ మృదుత్వం పింజ పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. పత్తి నాణ్యత అనేది జన్యు సంబంధమైనది. అయితే దీని మీద ఫోషక పదార్ధాల యాజమాన్యం, వాతావరణ మరియు చీడ పీడల ప్రభావం కొంత మేరుకు వుంటుంది.
పత్తి పూత దఫా దఫాలుగా రావటం వల్ల పత్తి ని కనీసం నాలుగైదు సార్లు తీయవలసి వస్తుంది. బాగా ఎండినటువంటి పత్తి మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. సాధారణంగా పత్తి డిసెంబర్, జనవరి నెలల్లో తీతకు రావడం, అదే కాలంలో మంచు కురియడం వలన పత్తి తడిసి ముద్దగా అవుతుంది. కాబట్టి పత్తిని ఉదయం ఎనిమిది గంటల తరువాత మధ్యాహ్నం ఒంటి గంట లోపల, మరల సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల తీసుకోవాలి. వేడి ఎక్కువగా వున్నా సమయంలో పత్తి తీస్తే వాటితో పాటు గుల్లల వద్ద వున్నా తొడిమలు, ఎండిన ఆకులుపెలుసెక్కి ముక్కలై పత్తికి అంటుకుంటాయి.